మకాడమియా నట్స్‌తో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి చూడ్డానికి అచ్చం కుంకుడు కాయ గింజల్లాగే ఉంటాయి. ఈ నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి షుగర్‌ను కంట్రోల్ చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు, పక్షవాతం వంటి సమస్యలు దరిచేరనీయవు.