దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదైనట్లు తెలుస్తోంది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన ప్రజల ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే ఆస్తి, ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటీవల భూమి కంపించిన విషయం తెలిసిందే.