GBS కలకలం.. 59 కేసులు నమోదు?

65చూసినవారు
GBS కలకలం.. 59 కేసులు నమోదు?
AP: రాష్ట్రంలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కలకలం రేపుతోంది. నిన్న ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మహిళ జీబీఎస్ బారిన పడి ప్రాణాలు విడిచింది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో 59 కేసులు నమోదైనట్లు సమాచారం. కానీ 14 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా వెంటనే వైద్యం అందకపోతే ఒళ్లంతా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. జీబీఎస్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్