ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు.. స్పందించిన మోదీ

73చూసినవారు
ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు.. స్పందించిన మోదీ
ఢిల్లీలో సంభవించిన స్వల్ప భూప్రకంపనలపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోసారి భూప్రకంపనలు వచ్చే సూచనలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0గా నమోదైంది.

సంబంధిత పోస్ట్