బస్సులో దొంగతనం చేస్తుండగా పిచ్చి కొట్టుడు కొట్టారు (వీడియో)

69చూసినవారు
ఓ యువకుడు బస్సులో దొంగతనం చేస్తుండగా పట్టుకున్న ప్రయాణికులు యువకుడిని దారుణంగా కొట్టారు. తాజాగా ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. రద్దీగా ఉన్న ఓ బస్సులు యువకుడు పక్కన ఉన్న మరో వ్యక్తి జేబు నుంచి పర్స్ కొట్టేయబోయాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు ఆ యువకుడిపై దాడికి దిగారు. బస్సులోనే తీవ్రంగా కొట్టారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.