పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా హాకీ జట్టు సభ్యుడు వివేక్ సాగర్ ప్రసాద్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోటి రూపాయల రివార్డును ప్రకటించింది. డీఎస్పీగా కూడా పని చేస్తున్న ప్రసాద్‌ను ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అభినందించారు. దేశానికి ఈ అద్భుతమైన విజయం అందించావంటూ ప్రశంసించారు.