ఉత్తరప్రదేశ్‌లోని మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తొలి రోజు పుష్య పౌర్ణమి కావడంతో భక్తులు త్రివేణీ సంగమంలో ఉదయాన్నే పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. గంగా పరిసరాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఇక్క డికి వచ్చే భక్తుల కోసం త్రివేణీ సంగమానికి ఇరువైపులా 4 వేల హెక్టార్లలో సౌకర్యాలు కల్పించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.