AP: శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ జరిగింది. ఈ విషయం బయటపడిన గంటలోపే విజిలెన్స్ అధికారులు నిందితుడుని గుర్తించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. పెంచలయ్య అనే వ్యక్తి పరకామణి మండపంలోని వంద గ్రాముల బంగారు బిస్కెట్‌ను దొంగిలించి వ్యర్థాలు బయటకు తీసుకెళ్లే ట్రాలీలో ఉంచారు. బయటకు వచ్చిన ట్రాలీలను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేయగా.. ట్రాలీలను కిందకు వంచినప్పుడు బంగారు బిస్కెట్ బయటపడింది.