దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం గుంపుగట్టు రామన్ పాడు పంప్ హౌస్ పక్కన కెనాల్ లో సోమవారం చేపల వలకు చిక్కిన భారీ కొండ చిలువను సాగర్ స్నేక్స్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్ రక్షించారు. కెనాల్ లో చేపల కోసం పెట్టిన వలలో సుమారు 11 కిలోల బరువు, 8 అడుగుల పొడవున్న కొండచిలువ చిక్కుకుంది. కృష్ణ సాగర్ సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడి వెళ్లి దాన్ని బయటకు తీసి అటవీ అధికారులకు అప్పగించారు.