కోతులను దూర ప్రాంతాలకు తరలించాలని వినతి

62చూసినవారు
కోతులను దూర ప్రాంతాలకు తరలించాలని వినతి
వనపర్తి జిల్లా మదనపురం మండల సమీపంలో ఉన్న దుప్పల్లి గ్రామంలో కొద్దిరోజుల నుంచి కోతుల బెడద చాలా తీవ్రంగా ఉంది. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ ఆదేశానుసారం సోమవారం జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో జిల్లా అదునపు కలెక్టర్ సంచిత్ అంగ్వర్ కి కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా వినతి పత్రం అందజేశారు. అదనపు కలెక్టర్ స్పందించి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్