దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని బండరపల్లి వంతెన మలుపు దగ్గర జాతీయ రహదారి 164 పై వరి ధాన్యంతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం. నారాయణపేట ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న ధాన్యం లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ధాన్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.