మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామానికి చెందిన నరసింహ శెట్టి కుమారుడు వేణుగోపాల్ శెట్టి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకొనిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదివారం ఆసుపత్రిలో బాధితుని పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.