ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. గురువారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా కానాయిపల్లి 31. 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టులో 30. 5 డిగ్రీలు, మహబూబ్ నగర్ జిల్లా ఉడిత్యాల్ లో 29. 5 డిగ్రీలు, నారాయణపేట జిల్లా గుండుమల్ లో 29. 0 ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో 29. 5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.