నారాయణపేట జిల్లా మరికల్ మండలం పూసలపాడు గ్రామంలో కర్ణాకర్ రెడ్డికి చెందిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తొవ్వారు. పూసలపాడు గ్రామంలో కర్ణాకర్ రెడ్డికి రెండు ఇండ్లు ఉండడంతో పాత ఇంట్లో ఈ నెల 11 వ తేదీన వివాహం జరిగిన తర్వాత కొత్త ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో లోతైన గుంత తవ్వడంతో షాక్ కు గురయ్యాడు. వెంటనే ఆదివారం మరికల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.