జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం కాపులకుంట గ్రామానికి చెందిన మలిచేటి ఆనంద్ రెడ్డి తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా (ఏజీపీ) నియమితులయ్యారు. ఆయన యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మలిచేటి రాజీవ్ రెడ్డి సోదరుడు. శుక్రవారం ఆనంద్ రెడ్డి తన నూతన బాధ్యతలను స్వీకరించారు. హైకోర్టు ఏజీపీగా ఆనంద్ రెడ్డి నియమితులవడంపై గద్వాల వాసులు, ఆయన మిత్రులు, తదితరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.