సీఎం రేవంత్ పై డీకే అరుణ ఫైర్

78చూసినవారు
మహబూబ్ నగర్ సభలో తనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై శనివారం బీజేపీ నాయకురాలు డీకే అరుణ స్పందించారు. ఎవరి బాగోతం ఏంటో ఎన్నికలలో తేల్చుకుందామని సవాల్ విసిరారు. ఓ మహిళ అని చూడకుండా రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న ఆయన స్థాయి ఏంటని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు ఆగస్టు 15లోగా నెరవేర్చకపోతే రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్