గరుడ ప్రసాదం తింటే సంతానం నిజమా?

581చూసినవారు
గరుడ ప్రసాదం తింటే సంతానం నిజమా?
ఈ ప్రచారం నిజమా? అబద్ధమా? అనే విషయాన్ని మనం నిరూపించలేం కానీ భక్తులకు ఓ నమ్మకం ఉంది. అదేంటంటే.. బాలాజీ ఆలయంలో శ్రీరామనవమి తర్వాత బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు పుట్టమన్నుతో పూజలు చేస్తారు. రెండోరోజు గరుత్మంతునికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ ప్రసాదాన్నే గరుడ ప్రసాదం అంటారు. ఈ ప్రసాదాన్ని సంతానం లేని మహిళలకు పంపిణి చేస్తారు. ఈ ప్రసాదం తిన్న వారికి సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.