ఉత్కంఠ పోరులో గెలిచినా.. మంత్రి పదవి దక్కలే..!

59చూసినవారు
ఉత్కంఠ పోరులో గెలిచినా.. మంత్రి పదవి దక్కలే..!
మహబూబ్ నగర్ ఎంపీగా ఉత్కంఠ పోరులో గెలిచిన డీకే అరుణకు కేంద్ర పదవి దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మహబూబ్ నగర్ లోక్ సభ పరిధిలో 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండి, సీఎం సొంత జిల్లాలో ఆ అభ్యర్థిపై తలపడి ఉత్కంఠ పోరులో 4500 ఓట్ల మెజార్టీతో అరుణ గెలవడంతోపాటు సీనియర్ నాయకురాలు కావడంతో మంత్రి పదవి దక్కుతుందని భావించినా, రాకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్