ఏపీలో బయటపడ్డ పురాతన కట్టడం

67చూసినవారు
ఏపీలో బయటపడ్డ పురాతన కట్టడం
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ప్రాచీనమైన రాతి కట్టడం బయటపడింది. చారిత్రక చంద్రగిరి రాలయవారికోటకు పడమర దిశలోని మండపానికి ఎడమ వైపున సుమారు రెండేకరాల్లో షేక్‌ ముజీబ్ అనే రైతుకు మామిడితోట ఉంది. ఈ తోటలో గుట్టగా ఉన్న మట్టిదిబ్బను తొలగిస్తుండగా పెద్ద రాతిబండల కట్టడం బయటపడింది. ఈ విషయాన్ని రైతు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వెళ్లి పరిశీలించారు. ఈ కట్టడం 11వ శతాబ్దానికి సంబంధించినదిగా అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్