మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నందిగామ మండలంలో ఉన్న హిమాలయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మంగళవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడంతో పరిశ్రమ మొత్తం నేలమట్టం అయ్యింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.