అక్రమ ఇసుక తయారీ స్థావరాలపై మైనింగ్ టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం చెన్నవెల్లి గ్రామ శివారులో గల దుందుభి వాగులో అక్రమ ఇసుక తయారీకి సంబంధించిన యంత్రాలను సోమవారం రాత్రి రెవెన్యూ అధికారులు, రాజాపూర్ పోలీసులు, మైనింగ్ టాస్క్ ఫోర్స్ అధికారుల పర్యవేక్షణలో దాడులు నిర్వహించి, ఇసుకను తయారుచేసి యంత్రాలను ధ్వంసం చేశారు.