వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ అధ్యయనం వేగవంతంగా జరుగుతుందని మహబూబ్ నగర్ ఎంపి డీకే అరుణ అన్నారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో జేపీసీ మెంబర్, ఎంపీ అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నివేదికలో పొందుపరచాల్సిన అంశాలపై జేపీసీ సభ్యులు కీలక చర్చలు జరిపారు. వచ్చే పార్లమెంట్ సెషన్స్ లో జేపీసీ తమ నివేదికను పార్లమెంట్ కు సమర్పించనుందని ఎంపీ అరుణ పేర్కొన్నారు.