భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. స్వామి వివేకానంద చికాగో వేదికగా చేసిన ప్రసంగం ప్రపంచ దేశాలు మెచ్చుకున్నారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.