బిజినేపల్లి మండలం వెలుగొండలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ-టీం ఫోక్సో చట్టం గురించి గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. షీ-టీం హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య మాట్లాడుతూ విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైతే దైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. షీ-టీంని సంప్రదించి ఫిర్యాదు చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి ఆకతాయిల ఆట కట్టించి సమస్యను పరిష్కరిస్తామన్నారు.