తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాల్లో నాగర్ కర్నూల్ జిల్లాలో డీఎస్సీ క్వాలిఫై అయి 1: 3 నిష్పత్తి ప్రకారం ఎంపికైన అభ్యర్థులకీ ఫోన్ కాల్స్ ద్వారా సమాచారమిచ్చి ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను సజావుగా చేపట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించే కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు.