అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎడిఎం

64చూసినవారు
అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎడిఎం
మన ఊరు మనబడి పథకంలో భాగంగా దామరగిద్ద, నారాయణపేట మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నాబార్డ్ ఎడిఎం షణ్ముఖ చారీ పరిశీలించారు. అదనపు తరగతుల నిర్మాణం, సోలార్ ప్యానల్ బిగింపు వంటి పనులను పరిశీలించారు. పనుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ, జాతీయ వాత్సల్య పెన్షన్ స్కీమ్ గురించి వివరించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్