నారాయణపేట పట్టణంలోని అంజనా ఫంక్షన్ హాలులో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అతిథులను ఆకట్టుకున్నాయి. రాష్ట్ర సంగీత నాటక అకాడమి ఛైర్మెన్ ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల ఆధ్వర్యంలో కళాకారులు జానపద పాటలకు నృత్యాలు చేశారు. ఏకపాత్ర అభినయం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, పథకాలను ఆటలు, పాటల రూపంలో కార్యక్రమానికి హాజరైన ప్రజలకు వివరించారు.