దన్వాడ: వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ధర్నా

65చూసినవారు
ధన్వాడ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ. వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వ్యాపారస్తులకు అమ్ముకునే పరిస్థితి దాపురించిందని అన్నారు. పాలకులు అధికారులు వెంటనే స్పందించి వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్