పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, పబ్లిక్ పాలసీ, లా, జర్నలిజాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేసిన తరువాత నెట్/ సెట్/ పీహెచ్‌డీతో విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అధ్యాపక ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. బోధన రంగంలో ఆసక్తి ఉంటే డీఈడీ, బీఈడీ చేయవచ్చు. డిగ్రీ అర్హత ఉన్న అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు.