ఎమ్మెల్యే ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

65చూసినవారు
ఎమ్మెల్యే ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
నారాయణపేట పట్టణంలోని పార్కుల్లో గురువారం మున్సిపల్ సిబ్బంది పరిశుభ్రత పనులు చేపట్టారు. పార్కుల్లో పారిశుధ్య పనులు, నిర్వహణ చేపట్టడం లేదని ప్రజలు ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఇటీవల మున్సిపల్ అధికారులు, శానిటరీ జవాన్ లతో సమావేశం నిర్వహించారు. వెంటనే పార్కుల్లో పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో మున్సిపల్ యంత్రాంగం కదిలి పనులు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్