నారాయణపేట జిల్లాలో సన్న రకం వరి ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలో నేటి వరకు రూ. 1, 48, 45, 800 జమ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి సుదర్శన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యం క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తుందని చెప్పారు. రైతులకు బోనస్ డబ్బులు ఎప్పటికప్పుడు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. డబ్బులు జమ కానీ రైతులకు త్వరలో బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు.