ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నరేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇంతియాజ్ విమర్శించారు. గురువారం సాయంత్రం నారాయణపేట పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 51 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని అన్నారు.