అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత

62చూసినవారు
అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత
నారాయణపేట మండలం అభంగాపూర్ గ్రామంలో ఆదివారం అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై రాముడు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు శివలీల కు చెందిన కిరాణా దుకాణంలో 14 క్వింటాళ్ల, శేఖర్ ఇంట్లో 2. 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పట్టుకున్న బియ్యం స్టేషన్ కు తరలించి రెవెన్యూ అధికారుల పంచనామా మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్