భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ద్వారానే అందించాలని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు అన్నారు శుక్రవారం నారాయణపేట పట్టణంలోని అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్మికులకు సంబంధించిన పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ సంస్థలకు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈనెల 18న కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామన్నారు.