గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామ పంచాయతీ సోమ్లా తండాల్లో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తండా ముఖ్య కూడలిలో జీవిఎస్ రాజాపూర్ మండల అధ్యక్షుడు పాత్లావత్ సతీష్ రాథోడ్ జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప అధ్యక్షుడు వినోద్ నాయక్, కార్యదర్శి శ్రావణ్ నాయక్, ప్రధాన కార్యదర్శి పాండు నాయక్, రఘు నాయక్, బులెట్ వినోద్ నాయక్,సురేష్, శ్రీశైలం, సురేష్, తదితరులు పాల్గొన్నారు.