వనపర్తి మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్‌కు నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ నెల 24, 25 తేదీలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, అండర్ 17 మండల స్థాయి క్రీడలను నిర్వహించనున్న నేపథ్యంలో క్రీడా ప్రాంగణాన్ని శుభ్రం చేయించాలని, విద్యుత్ ద్వీపాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ పూర్ణచందర్‌ను కోరారు.