పోగొట్టుకున్న ఫోన్ అందజేత

544చూసినవారు
పోగొట్టుకున్న ఫోన్ అందజేత
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మోట్లంపల్లి గ్రామానికి చెందిన గుడిసె నాగన్న గత నెల 27న గుంటీపల్లి నుంచి ఆత్మకూరుకు బైక్ పై వెళుతుండగా తన మొబైల్ ఫోన్ పడిపోయింది. వెంటనే ఆత్మకూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ నరేందర్ ఆధ్వర్యంలో సిఇఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ను రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు.

సంబంధిత పోస్ట్