రన్‌వేపై ప్రమాదానికి గురైన విమానం (వీడియో)

70చూసినవారు
నైజీరియాలోని లాగోస్ విమానాశ్రయంలో మంగళవారం ఊహించని ప్రమాదం జరిగింది. డానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రన్ వేపై ప్రమాదానికి గురైంది. రన్‌వేపై నుంచి పక్కకు వెళ్లిపోయింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. విమానంలోని మొత్తం 83 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్