పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని వారి వల్లే ప్రజలు సురక్షితంగా ఉన్నారని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఎస్పి మాట్లాడుతూ. నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడేది పోలీస్ శాఖ మాత్రమేనని అన్నారు. పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు.