వనపర్తి జిల్లాలో వినాయక నిమజ్జన పర్వం ముగిసింది. 11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణపయ్యలు మంగళవారం రాత్రి గంగమ్మ ఒడికి చేరారు. నిమజ్జన శోభాయాత్ర బుధవారం తెల్లవారుజాము వరకు సాగింది. నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడిషనల్ ఎస్పీ రాందాస్ తేజోవత్ సిబ్బందితో జిల్లాలో నిమజ్జనం చేసే అన్ని ప్రాంతాలను పర్యవేక్షించారు.