వనపర్తి జిల్లా కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలను ఎస్పీ రావుల గిరిధర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రేరణ కలిగేలా టీచర్ గా మారారు. తెలుగు వర్ణమాలతో పాటు గణితంలోని పలు అంశాలను విద్యార్థులకు బోధించారు. విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదగడానికి ప్రాథమిక విద్య సమయంలో నేర్చుకున్న అంశాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులను అభినందించారు.