శంషాబాద్‌లోని సిటా గ్రాండ్ ఓయో హోటల్ నిర్వాహకుడు గణేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు హోటల్ కు వచ్చిన జంటలు ఏకాంతంగా గడిపిన క్షణాలను రహస్య కెమెరాల ద్వారా వీడియోలు తీసి, వాటిని చూపించి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించారు. గణేశ్ హోటల్ గదుల్లోని బల్బు హోల్డర్లలో ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ జంట సీక్రెట్ కెమెరాలను గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.