Oct 13, 2024, 08:10 IST/
పట్టపగలు గూడ్స్ రైల్లో దోపిడీ.. వీడియో వైరల్
Oct 13, 2024, 08:10 IST
అమెరికాలో షాకింగ్ ఘటన జరిగింది. పట్టపగలు కొందరు నిలిపి ఉంచిన గూడ్స్ రైల్లో దోపిడీకి పాల్పడ్డారు. కార్లు, ట్రక్కులతో వచ్చి రైల్లోని టీవీలు, ఎయిర్ ఫ్రైయ్యర్లు, ఇతర సామాన్లను ఎత్తుకెళ్లారు. చికాగోలోని లేక్, కిన్జీ స్ట్రీట్స్ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. తుపాకులతో హెచ్చరించడంతో దొంగలు పారిపోయారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలీదు గాని.. ఈ వీడియో వైరల్ అవుతోంది.