తెలుగు హీరో నారా రోహిత్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ప్రతినిధి-2 మూవీ హీరోయిన్ శిరీష (సిరిలెల్లా)తో రోహిత్ నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. వీరి నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు, అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడే రోహిత్.