రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానపరిచేవిధంగా అనుచిత వాఖ్యలు చేసినందుకు నిరసనగా కేంద్రమంత్రి అమిత్ షా దిష్టి బొమ్మను గురువారం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద మాదిగ హక్కుల
దండోరా నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమిత్ పై దేశ ద్రోహం కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్పై అనుచిత వాఖ్యలు
చేయడం సరికాదన్నారు.