చెరువును ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

77చూసినవారు
చెరువును ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
చెన్నూరు పట్టణంలోని శనిగల కుంట చెరువును ధ్వంసం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వివేక్ అధికారులకు ఆదేశించారు. చెన్నూరులో ఆయన మాట్లాడుతూ తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో చెరువును సందర్శించలేకపోయానని పేర్కొన్నారు. అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. మట్కా, జూదం వాటిపై ఉక్కు పాదం మోపాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్