చెన్నూరు నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు మంగళవారం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో 25 లక్షల నిధులతో బస్ షెల్టర్, వాకింగ్ ట్రాక్, సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.