దుండగులను కఠినంగా శిక్షించాలి

68చూసినవారు
దుండగులను కఠినంగా శిక్షించాలి
చెన్నూరు పట్టణంలోని శనిగకుంట చెరువు మత్తడిని బాంబులు పెట్టి ధ్వంసం చేసిన దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని చెరువు మత్తడిని డిటోనేటర్లతో గుర్తుతెలియని దుండగులు కూల్చివేయగా బిజెపి నాయకులు మత్తడిని పరిశీలించారు. ‌పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ బాంబులు పెట్టి చెరువులను పేల్చడం అమానవీయ ఘటన అన్నారు.

సంబంధిత పోస్ట్