వైభంగా పోచమ్మ బోనాల ఉత్సవం

72చూసినవారు
వైభంగా పోచమ్మ బోనాల ఉత్సవం
కోటపల్లి మండలంలోని సిర్సా గ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది అషాడ మాసంలో గ్రామంలో నిర్వహించే ఉత్సవంలో భాగంగా డప్పు చప్పుళ్ళ మధ్య మహిళలు బోనాలతో పోచమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు. పంటలు సమృద్ధిగా పండాలని, ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ పెద్దింటి పున్నం చంద్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్