మొక్కలు పంపిణీ చేసిన మున్సిపల్ మాజీ చైర్మన్
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శనివారం మంచిర్యాల మున్సిపాలిటీ 8వ వార్డు పరిధిలోని పాత మంచిర్యాలలోని మున్సిపల్ మాజీ చైర్మన్, స్థానిక కౌన్సిలర్ పెంట రాజయ్య మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన జీవరాశి మనుగడ, పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహదపడుతాయన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.